Advertisement
ఏదైనా భాషలో సినిమా వచ్చిందంటే, ఆ సినిమాని మళ్లీ ఇంకో భాషలోకి డబ్బింగ్ చేస్తూ ఉంటారు. ఇలా డబ్బింగ్ సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే నిజానికి రియల్ మూవీ ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే సినిమా డబ్బింగ్ చేశాక ఆ సినిమాను నెత్తిన పెట్టుకుంటూ వుంటారు ప్రేక్షకులు. అటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. నిజానికి బాహుబలి సినిమాకి ముందు అసలు ఎవరు తెలుగు సినిమాని చూసేవారు కాదు. కానీ రాజమౌళి బాహుబలి సినిమా వచ్చిన తర్వాత నుండి కూడా తెలుగు సినిమా విలువ బాగా పెరిగింది.
Advertisement
ఈమధ్య అయితే చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. కాంతారా సినిమా తర్వాత తెలుగు ఆడియోస్ దృష్టి చిన్న సినిమాల మీద కూడా పడుతోంది. తాజాగా సప్త సాగరాలు దాటి అనే టైటిల్ తో తెలుగులో ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ కన్నడ మూవీకి పాజిటివ్ రివ్యూస్ బాగా వచ్చాయి. ఈ సినిమాని అందరూ బాగా చూస్తున్నారు అని కూడా తెలుస్తోంది. అలానే రక్షిత్ శెట్టి చార్లీ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు.
Advertisement
అతడే శ్రీమన్నారాయణ సినిమా కూడా ఇక్కడ బానే ఆడింది. అయితే సప్త సాగరాలు దాటి స్టోరీ ఇంచుమించు రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాలానే ఉంటుంది. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2006 లో రిలీజ్ అయింది. ఫ్లాప్ అయిపోయింది. అదే కాన్సెప్ట్ వచ్చిన తెలుగు సినిమాని ప్లాప్ చేసి డబ్బింగ్ సినిమాని మాత్రం హిట్ చేసేసారు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also read: