Advertisement
చాలామందికి వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది.. మరి ఈ నాన్ వెజ్ లో రకరకాలు ఉన్నాయి.. మనం ముఖ్యంగా తినేది మటన్, చికెన్, చేపలు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. మరి వీటిలో ఏది ఎక్కువగా తింటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..సాధారణంగా నాన్ వెజ్ లో చూసుకుంటే చేపలు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Advertisement
ALSO READ:జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ?
ఇందులో ఎక్కువగా ఒమేగా త్రీ ఉంటుంది. సముద్రంలో దొరికే ఏ ఫుడ్ అయినా ఆరోగ్యానికి మంచిదే. ఇక ముఖ్యంగా చికెన్ విషయానికి వస్తే నాటు కోడి స్కిన్ తో తింటే చాలా మంచిది. ఇక ఇందులో లివర్ అనేది అత్యంత కీలకమైన ఆహారంగా చెబుతారు. మటన్ విషయానికి వస్తే వాటి బోన్స్ ద్వారా తయారుచేసిన సూప్ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ సూప్ అంత బలమైంది ఎక్కడా లేదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బాయిలర్ కోడి కూడా మంచిదే కానీ స్కిన్ తో తినాలని అంటున్నారు.
Advertisement
మటన్ చాలా బలమైన ఆహారం కానీ ఇందులో ఉండే హై ప్రోటీన్ కంటెంట్ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా మటన్ ఫ్యాట్ ఎక్కువగా పెరిగి ఉన్నవారు తినకపోవడం మంచిది అంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ తినే సమయంలో ఆలోచించవలసింది ఏంటంటే కిడ్నీ కి సంబంధించిన సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ ఫుడ్డు ను చాలా వరకు తగ్గించు కుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ALSO READ:రోడ్డు పక్కన ఉండే చెట్లకు ఎరుపు, తెలుపు రంగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?