Advertisement
ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం కలిగినటువంటి కుంకుమ పువ్వుతో మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనిలోని పోషకాల కారణంగానే దీనిని వంట గదిలో, ఔషదాల తయారీలో ఇంకా ఇతర పద్దతులలో ఉపయోగిస్తారు. అసలు కుంకుమ పువ్వును ఉపయోగిస్తే.. ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
- సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు కుంకుమ పువ్వును ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుపై మెరుగు పరిచి కడుపు సంబంధిత సమస్యలను పరిస్కరిస్తుంది. ఆకలి కోరికను నియంత్రించి బరువు తగ్గేవిధంగా చేస్తుంది.
- కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే టైప్ 2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో బాధపడే వారికి మేలు జరుగుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.
Advertisement
- సొరియాసిస్ సమస్యకు చెక్ పెట్టేందుకు కుంకుమపువ్వు చాలా మెరుగ్గా పని చేస్తుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇంకా దీనిలోని విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు తొలగిపోవడానికి సహాయపడుతాయి.
- మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది కుంకుమ పువ్వు. దీనిలో ఉండే పోషకాలు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తాయి.
- తనలోని ఔషద గుణాల కారణంగా రుతుస్రావ సమయంలో కలిగే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం మీరు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే సరిపోతుంది.
Also Read :
జ్ఞాపక శక్తి మెరుగవ్వలా ? అయితే జీడి పప్పుని ఇలా తీసుకోండి !